మూడో ప్రభంజనానికి రెడీ అవుతున్న వివేక్.. ఈసారి రెండు భాగాలుగా!
on Oct 3, 2024
2005లో ‘చాకొలెట్’ చిత్రంతో దర్శకుడిగా బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన వివేక్ రంజన్ అగ్నిహోత్రి తన కెరీర్‌లో చేసిన సినిమాలన్నీ ప్రత్యేకంగా ఉండేలా చూసుకున్నారు. ఇప్పటివరకు 10 సినిమాలను డైరెక్ట్ చేసిన వివేక్ 2019లో రూపొందించిన ‘ది తాష్కెంట్ ఫైల్స్’ చిత్రంతో ప్రపంచవ్యాప్తంగా అందర్నీ అలర్ట్ చేశారు. ఆ తర్వాత 2022లో తీసిన ‘ది కాశ్మీర్ ఫైల్స్’ చిత్రంతో అందరూ ఉలిక్కిపడేలా చేశారు. ఈ సినిమా ఒక ప్రభంజనం సృష్టించిందని చెప్పాలి. ఇప్పుడు మరో కొత్త ప్రభంజనానికి శ్రీకారం చుట్టబోతున్నారు వివేక్. ఆ సినిమా పేరు ‘ది ఢల్లీి ఫైల్స్’. అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ పతాకంపై అభిషేక్ అగర్వాల్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
‘ది ఢల్లీి ఫైల్స్’ చిత్రానికి సంబంధించిన తాజా అప్‌డేట్‌ను ఇటీవల తెలియజేశారు దర్శకుడు వివేక్. ‘ఈ కథపై ఎంతోకాలంగా పరిశోధన చేస్తున్నాను. కథలో ఉన్న డెప్త్‌ని దృష్టిలో ఉంచుకొని రెండు భాగాలుగా ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నాం. మొదటి భాగాన్ని ‘ది బెంగాల్ చాప్టర్’ పేరుతో వచ్చే ఏడాది ఆగస్ట్ 15న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాం. కొన్ని సంవత్సరాల క్రితం డైరెక్టర్‌గా నా కెరీర్ ప్రారంభించిన నేను ఇప్పటివరకు ఎవరూ చెప్పని కథలతో సినిమాలు చేస్తూ వస్తున్నాను. వాటిలో ది తాష్కెంట్ ఫైల్స్, ది కాశ్మీర్ ఫైల్స్ చిత్రాలు చరిత్ర సృష్టించాయి. అలాంటి ఓ విభిన్నమైన కథతో రూపొందిస్తున్న ది ఢల్లీి ఫైల్స్ కూడా తప్పకుండా మీకు నచ్చుతుంది’ అని వివరించారు వివేక్ రంజన్ అగ్నిహోత్రి.
Also Read